: మంద కృష్ణ పాత తరం హీరో... నేను రాంచరణ్ లాంటి యంగ్ హీరోని: పిడమర్తి రవి
తెలంగాణ ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి నిన్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణపై విరుచుకుపడ్డారు. దళిత ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన మంద కృష్ణకు అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ ల గురించి మాట్లాడే అర్హత లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంద కృష్ణను మాదిగ జాతి వెలేసిన జోకర్ గా పిడమర్తి రవి అభివర్ణించారు. అంతటితో ఆగని ఆయన మంద కృష్ణను పాత తరం హీరోగా పేర్కొన్నారు. తాను మాత్రం అల్లు అర్జున్, రాంచరణ్ తేజ్ లాంటి యంగ్ హీరోనని వ్యాఖ్యానించారు.