: స్మృతి ఇరానీకి షాకిచ్చిన కేసులో నలుగురు ఫ్యాబ్ ఇండియా ఉద్యోగుల అరెస్ట్
దుస్తులు మార్చుకునే గదిలో రహస్య కెమెరాలు పెట్టి కేంద్ర మంత్రినే 'షూట్' చేయాలని పథకం వేసిన నలుగురు ఫ్యాబ్ ఇండియా ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంప్రదాయ లైఫ్ స్టైల్ బ్రాండ్ గా ప్రజల్లో గుర్తింపున్న ఫాబ్ ఇండియా గోవా అవుట్ లేట్ లో బట్టలు ట్రయిల్ చూసేందుకు ఇరానీ సంకల్పించగా, ఆ గదివైపు ఒక కెమెరా ఉన్నట్టు కనుగొన్నారు. ఈ కేసును తీవ్రంగా తీసుకున్న గోవా పోలీసులు ఇప్పటివరకూ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సంస్థ ఉన్నత ఉద్యోగులను సైతం ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ స్టోర్ కంప్యూటర్ హార్డ్ డిస్క్ లో గోవా మహిళా నేత మిచెల్ లోబో దృశ్యాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ స్టోర్ లో పనిచేస్తున్న పరేష్ భగత్, రాజు పయాంచీ, ప్రశాంత నాయక్, కరీం లఖానీలను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఫ్యాబ్ ఇండియా ఎండీని కూడా విచారించనున్నామని పేర్కొన్నారు.