: సీతారామపురంలో ‘సూర్యాపేట’ షూటర్లు?... పోలీసులపై కాల్పులు, బైక్ పై పరారీ


నల్గొండ జిల్లా సూర్యాపేటలో కాల్పులకు తెగబడి ఇద్దరు పోలీసులను పొట్టనబెట్టుకున్న దోపిడీ దొంగలు ఇంకా ఆ జిల్లాలోనే ఉన్నారు. అరవపల్లి మండలం సీతారామపురంలో కొద్దిసేపటి క్రితం పోలీసులు, గుర్తు తెలియని దుండగుల మధ్య ఆరు రౌండ్ల కాల్పులు చోటుచేసుకున్నాయి. అనంతరం దుండగులు ఓ వ్యక్తిని తుపాకీతో బెదిరించి అతడి బైక్ ను బలవంతంగా లాక్కుని దానిపై పరారయ్యారు. వీరిని పోలీసులు వెంబడిస్తున్నారు. సూర్యాపేట కాల్పుల నేపథ్యంలో నల్గొండ జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాల్లోనూ పోలీసుల సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తమకు తారసపడ్డ పోలీసులపై దొంగలు కాల్పులు జరిపినట్లు సమాచారం. అయితే ఈ కాల్పుల్లో ఏ ఒక్కరూ గాయపడలేదని తెలుస్తోంది. కాల్పులతో సీతారామపురం పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News