: ఒడిశా సీఎంపై ‘గుడ్డు’ ఎఫెక్ట్... 16 మంది ఎన్ఎస్ యూఐ నేతలకు రిమాండ్!
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కాన్వాయ్ పై కోడిగుడ్లు విసిరిన కారణంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ నేతలకు జైలు తప్పలేదు. ఫిబ్రవరిలో సీఎం కాన్వాయ్ పై కోడిగుడ్ల దాడి జరిగితే, తాజాగా ఎన్ఎస్ యఐ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు రోజుల క్రితం రిమాండ్ కు తరలించారు. వీరిలో ఎన్ఎస్ యూఐ ఒడిశా అధ్యక్షుడు సత్యజిత్ పట్నాయక్ సహా 16 మంది విద్యార్థి సంఘం నేతలున్నారు. విద్యారంగం పట్ల ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూనే తాము నాటి ఘటనకు పాల్పడ్డామని, ఇందులో తమకు ఎలాంటి దురుద్దేశం లేదని, బెయిల్ మంజూరు చేయాలన్న విద్యార్థి సంఘం నేతల వినతిని కోర్టు తోసిపుచ్చింది. దీంతో అరెస్టైన సత్యజిత్ సహా 16 మంది విద్యార్థి సంఘం నేతలు జైలుకు వెళ్లక తప్పలేదు. రాజకీయ దురుద్దేశాలతోనే నవీన్ పట్నాయక్ సర్కారు విద్యార్థులను సైతం జైలుపాల్జేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.