: నేడు హనుమాన్ జయంతి... హైదరాబాదులో లక్ష బైకులతో భజరంగ్ దళ్ భారీ ర్యాలీ


నేడు హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించుకునేందుకు హిందువులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా భజరంగ్ దళ్ హైదరాబాదులో మునుపెన్నడూ జరగని రీతిలో భారీ ర్యాలీ నిర్వహించనుంది. దాదాపు లక్ష బైకులతో ఈ ర్యాలీ జరగనుంది. కోఠీ సమీపంలోని గౌలిగూడ నుంచి ప్రారంభం కానున్న ఈ ర్యాలీ సికింద్రాబాదులోని తాడ్ బండ్ వరకూ కొనసాగనుంది. ఈ ర్యాలీలో భజరంగ్ దళ్ జాతీయ అధ్యక్షుడు రాజేశ్ పాండే ప్రత్యక్షంగా పాలుపంచుకోనున్నారు. భజరంగ్ దళ్ భారీ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ర్యాలీ జరిగే మార్గంలో ట్రాఫిక్ పై ఆంక్షలు అమలు చేయనున్న పోలీసులు, ర్యాలీ మార్గంలో 18 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల కింద నాలుగు వేల మంది పోలీసులతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News