: నాలుగు రంగులకు అర్థాలు చెప్పిన మోదీ


జాతీయపతాకంలోని మూడు రంగులతో మరో రంగును జోడించి ప్రధాని నరేంద్ర మోదీ కొత్త భాష్యం చెప్పారు. మువ్వన్నెల జెండాలో మూడు రంగులలో కాషాయం త్యాగానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ సతతహరితానికి ప్రతీకలని ఇంత వరకు చదువుకున్నాం... బెంగళూరులో బీజేపీ జాతీయ కార్యవర్గ సదస్సులో మోదీ మాట్లాడుతూ, కాషాయం విద్యుత్ శక్తికి ప్రతీక అని, తెలుపు క్షీర విప్లవానికి సంకేతమని, ఆకుపచ్చ హరిత విప్లవానికి సూచన అని, నీలం రంగు (అశోకచక్రం) సముద్ర శక్తిని తెలుపుతుందని అన్నారు. భారత్ ను ప్రపంచంలో అగ్రగామిగా నిలపడమే తన కర్తవ్యమని ఆయన చెప్పారు. భూసేకరణ బిల్లుపై ఆయన మాట్లాడుతూ, దేశంలోని ప్రతి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం వైపు చూస్తున్నాడని, 5 లక్షలు కట్టైనా ఉద్యోగం సంపాదించుకుందామని భావిస్తున్నారని అన్నారు. పల్లెల్లో భూతగాదాల కారణంగా పంటలు వేయకుండా భూములు బీళ్లుగా వదిలేస్తున్నారని, అందుకు తాము భూసేకరణ బిల్లును తీసుకువస్తున్నామని అన్నారు. తాను కూడా వ్యవసాయాధారిత కుటుంబం నుంచే వచ్చానని ఆయన చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర, ప్రయోజనాలు కల్పించాలన్నదే తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News