: కేంద్ర మంత్రికే ఇంత అవమానం జరిగితే... ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?: రోజా


గోవాలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకే ఇంత అవమానం జరిగితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని వైఎస్సార్సీపీ మహిళా నేత ఆర్కే రోజా ప్రశ్నించారు. తిరుపతిలో ఆమె మాట్లాడుతూ, నాలుగు నెలలుగా ఆ ట్రయల్ రూమ్ లో సీసీ కెమెరాలు ఉన్నాయంటే, దేశంలో ఇంతకంటే దారుణం ఇంకేదయినా ఉందా? అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలపై నిర్భయ చట్టం అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నిందితులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని ఆమె సూచించారు. కేంద్ర మంత్రి ఘటన మొదటిది కాదని, గతంలో హైదరాబాదులో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News