: కోట్ల కుమారుడి వివాహానికి అందరూ వచ్చారు!
రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీలో కాంగ్రెస్ దాదాపు భూస్థాపితం కాగా, తెలంగాణలో ప్రతిపక్షంగా కొనసాగుతోంది. టీడీపీ పరిస్థితి ఏపీలో అద్భుతంగా ఉండగా, తెలంగాణలో మాత్రం దయనీయం. నేతలు సమయం కోసం వేచిచూస్తున్నారు. వైరి పక్షాలతోనైనా సఖ్యతతో మెలిగేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఎవరు, ఎప్పుడు, ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి కొనసాగుతుండడంతో... ఏ పార్టీ నేత ఇంట్లోనైనా, ఏం జరిగినా అందరూ వాలిపోతున్నారు. తాజాగా, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుమారుడు రాఘవేంద్ర రెడ్డి వివాహం రాయదుర్గంలో ఘనంగా జరిగింది. ఇక్కడి జేఆర్ సీ హాల్ లో జరిగిన ఈ పెళ్లికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. తెలంగాణ నేతలు రేవంత్ రెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, కె.కేశవరావు... ఏపీ నేతలు రఘువీరారెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, చిరంజీవి, కేవీపీ రామచంద్రరావు, మాజీ సీఎం కిరణ్ తదితరులు విచ్చేశారు. వీరే కాదండోయ్... టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేశ్, హరికృష్ణ కూడా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.