: తల్లికి తలకొరివి పెట్టిన చెల్లిని నరికేసిన కిరాతకుడు!


బతికుండగా తల్లిని పట్టించుకోలేదు, ఆమె చనిపోయాక తల్లికి తలకొరివి పెట్టిందన్న కోపంతో చెల్లిని నరికేశాడు. ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ సమీపంలోని ఓ గ్రామంలో మరణించిన మహిళ (80) ఆఖరి కోరిక మేరకు, ఆమె కుమార్తె, ఆ గ్రామ సర్పంచ్ గీతా వర్మ(44) అంత్యక్రియలు నిర్వహించింది. అనంతరం నిర్వహించాల్సిన కార్యక్రమాల కోసం ఆమె తన చెల్లెలు, ఇతర బంధువులతో కలిసి బావి వద్దకు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన ఆమె సోదరుడు సంతోష్ వర్మ తన కుమారుడితో కలిసి వారిని అటకాయించి, గొడ్డలితో దాడిచేశాడు. గీతా వర్మను విచక్షణారహితంగా నరకడంతో ప్రాణాలు విడిచింది. అనంతరం తాను తప్పు చేయలేదని, తాను చేయాల్సిన అంత్యక్రియలను సోదరి ఎలా చేస్తుందంటూ ప్రశ్నించాడు. లేదు

  • Loading...

More Telugu News