: కారణం తెలియదు.... దశాబ్దంపాటు భారత్ కు స్థానమే లేకుండాపోయింది: మోదీ


బెంగళూరులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. దశాబ్దం పాటు భారత్ కు ప్రపంచంలో సముచిత స్థానం లేకుండాపోయిందని అన్నారు. అయితే, అందుకు కారణాలు తెలియవన్నారు. కానీ, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందని తెలిపారు. ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని చెప్పారు. ఉద్దేశాలు మంచివైతే, ఫలితాలు కూడా మంచిగానే వస్తాయని అభిప్రాయపడ్డారు. నల్లధనం తిరిగి తీసుకువచ్చేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ స్పష్టం చేశారు. తాము వచ్చాక ప్రజల్లో నమ్మకం పెరిగిందని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News