: 6వ తేదీన తెరుచుకోనున్న స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు నిన్నటి నుంచి క్లోజ్ అయ్యాయి. నిన్న మహావీర్ జయంతి, నేడు గుడ్ ఫ్రైడే కారణంగా మూతపడగా... రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కావడంతో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. దీంతో, 6వ తేదీ (సోమవారం) మార్కెట్లు పున:ప్రారంభం అవుతాయి. చివరి ట్రేడింగ్ రోజు (బుధవారం)న బీఎస్ఈ సెన్సెక్స్ 303 పాయింట్ల లాభంతో 28,260కు పెరగగా... నిఫ్టీ 95 పాయింట్లు పుంజుకుని 8,586కి ఎగబాకింది.