: శ్రీలంకలో భారత జంట అనుమానాస్పద మృతి
శ్రీలంక రాజధాని కొలంబోలో ఓ భారత జంట అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. వెల్లవాట్ట ప్రాంతంలోని ఓ హోటల్ గదిలో 30 ఏళ్ల పురుషుడు, 28 ఏళ్ల మహిళ మృతదేహాలను గుర్తించారు. భారత్ నుంచి మార్చి 27న శ్రీలంకకు వచ్చిన వారు హోటల్ లో బస చేసినట్టు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి నుంచి, వారు గది నుంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించాడు. అనుమానాస్పద మరణాల కింద పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.