: ముంబయిలో కార్యాలయం తెరవబోతున్న హార్వర్డ్ వర్శిటీ
ప్రపంచంలోనే పేరెన్నికగన్న హార్వర్డ్ విశ్వవిద్యాలయం భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల్లో కార్యాలయాలు తెరవబోతోంది. ఆ ప్రాంతాల్లో తన అనుబంధ పరిశోధన, విద్యా సంబంధ కార్యకలాపాలు మరింత సులభతరంగా నిర్వహించేందుకుగానూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో, ముంబయిలో తమ కార్యాలయం (స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్టు వర్శిటీ కళాశాల వార్తా పత్రిక 'ద హార్వర్డ్ క్రిమ్సన్' తెలిపింది. చైనా, దక్షిణాఫ్రికాలోని కార్యాలయాలకంటే భారత్ లో కార్యాలయానికి సంబంధించిన పనులు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాయని యూనివర్శిటీ ఉపకులపతి (అంతర్జాతీయ వ్యవహారాలు) జార్జ్ ఐ డోమిన్గ్వేజ్ తెలిపారు. ఈ వేసవిలో భారత ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు.