: ఎన్టీఆర్ బీచ్ కు రూ. 50 కోట్లు మంజూరు చేసిన కేంద్రం


కాకినాడ వాకలపూడి సమీపంలోని ఎన్టీఆర్ బీచ్ ను అభివృద్ధి చేయడానికి కేంద్ర టూరిజం శాఖ రూ. 50.76 కోట్ల నిధులను మంజూరు చేసిందని టీడీపీ ఎంపీ తోట నరసింహం తెలిపారు. ఈ నిధులతో ఆక్వా మెరైన్ పార్క్, కన్వెన్షన్ హాల్, రెస్టారెంట్లు తదితర నిర్మాణాలు చేపడతామని, దీంతో, పర్యాటకులను భారీగా ఆకర్షించవచ్చని వెల్లడించారు. ఏపీలో బీచ్ టూరిజంను అభివృద్ధి చేస్తామని గతంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News