: మగవాళ్లందరూ రేపిస్టులేనని నేనెప్పుడూ చెప్పలేదు: నటి నందితా దాస్
బాలీవుడ్ నటి నందితా దాస్ ఇటీవల ఓ విపరీత వ్యాఖ్య చేసి తీవ్ర విమర్శలు మూటగట్టుకోవాల్సివచ్చింది. ఆ తరువాత తను ఆ వ్యాఖ్యకు వివరణ ఇచ్చి, అందరినీ ఉద్దేశించి తాననలేదని చెప్పింది. 'మగవాళ్లందరూ రేపిస్టులే' అని నందిత ప్రకటన చేసిందటూ సోషల్ మీడియాలో బాగా వ్యాపించడంతో కలకలమే రేగింది. దాంతో వెంటనే ఆమె ట్విట్టర్ లో తన వ్యాఖ్యకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. "ఆ వ్యాఖ్య నేను చేసినట్టు తప్పుగా ఉటంకించారు. మగవాళ్లంతా రేపిస్టులేనని నేనెప్పుడూ చెప్పలేదు. ఈ విధంగా అర్థం చేసుకోవడం ఎంత తెలివితక్కువపని? నేను వివరణ ఇవ్వాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉంది" అని నందితా ట్వీట్ చేసింది.