: క్రిస్ మస్ కి షారూఖ్, కాజోల్ 'దిల్ వాలే'


'దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే' సినిమాతో భారత సినీ ప్రేక్షకుల మనసులు దోచుకున్న షారూఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటిస్తున్న 'దిల్ వాలే' సినిమా క్రిస్ మస్ కి విడుదల కానుంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రెండు జంటలు సందడి చేయనున్నాయి. షారూఖ్, కాజోల్ ఒక జంట కాగా, యువ హీరో వరుణ్ ధావన్, 'వన్ నేనొక్కడినే' ఫేం కృతి సనన్ రెండో జంటగా నటించనున్నారు. ఈ సినిమాకు తాను, షారూఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మాతలమని, గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న రోహిత్ శెట్టి తెలిపారు. కాగా, 'కభీ ఖుషీ కభీ ఘమ్' సినిమా అనంతరం, సుదీర్ఘ విరామం తరువాత ఈ జంట వెండితెరపై కనువిందు చేయనుండడం విశేషం.

  • Loading...

More Telugu News