: 2024లో భారత్ లో ఒలింపిక్ క్రీడలు.. బిడ్ దాఖలు దిశగా కేంద్రం అడుగులు
ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ ఆసక్తి కనబరుస్తోంది. వచ్చే ఏడాది బ్రెజిల్ నగరం రియోడీజెనీరో కేంద్రంగా జరగనున్న ఒలింపిక్స్ సంరంభం, 2020లో టోక్యోకు మారనుంది. ఇక 2024లో జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలకు వేదిక ఖరారు కావాల్సి ఉంది. వచ్చే ఏడాది రియోలో జరగనున్న ఒలింపిక్స్ క్రీడల కంటే ముందుగానే 2024 వేదికను ఖరారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఒలింపిక్స్ ను నిర్వహించేందుకు భారత్ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు బిడ్ దాఖలు చేయాలని మోదీ సర్కారు యత్నిస్తున్నట్లు సమాచారం.