: శ్రీసిటి సెజ్ లో పెప్సికో యూనిట్ ను ప్రారంభించిన చంద్రబాబు
చిత్తూరు జిల్లా సత్యవేడులోని శ్రీసిటీ సెజ్ లో ఏర్పాటు చేసిన పెప్సికో యూనిట్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. మొత్తం 11 పారిశ్రామిక యూనిట్లను సీఎం ప్రారంభించారు. ఇదే సెజ్ లో మరో 9 యూనిట్లకు బాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పెప్సికో సంస్థ సీఈవో ఇంద్రనూయి, తదితరులు పాల్గొన్నారు.