: రోజుకు 60 సిగరెట్లు, ఓ ఫుల్ బాటిల్ తాగినా ఏం కాదు: బీజేపీ ఎంపీ రామ్ ప్రసాద్
ధూమపానం కేన్సర్ కు కారణమవుతుందని నమ్మేవారు తను చెప్పే మాటలను పరిగణలోకి తీసుకోవాలని బీజేపీ అస్సాం లోక్ సభ సభ్యుడు రామ్ ప్రసాద్ శర్మ అంటున్నారు. "ప్రతిరోజు ఓ బాటిల్ ఆల్కహాల్, 60 సిగరెట్టు తాగే ఇద్దరు వ్యక్తులు నాకు తెలుసు. వారిలో ఒకరు 86 సంవత్సరాల వయసు వరకు బతికారు. మరొకరు ఇప్పటికీ బతికే ఉన్నారు. కాబట్టి పొగ తాగడం వల్ల కేనర్స్ వస్తుందనే వారు ఈ విషయాన్ని గమనించాలి" అని సదరు ఎంపీ చెబుతున్నారు. కాబట్టి, ధూమపానం కేన్సర్ కు కారణమవుతుందా? లేదా? అనేది పెద్ద చర్చనీయాంశం కాదన్నారు. ఈ క్రమంలో పొగాకు ఉత్పత్తులకు మద్దతు తెలుపుతూ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతల్లో శర్మ మూడో వ్యక్తిగా ఉన్నారు. అంతేకాదు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆ ముగ్గురు కూడా పొగ తాగడాన్ని తగ్గించేందుకు తీసుకురానున్న కొత్త విధానాన్ని సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యులు కావడం గమనార్హం.