: మరోసారి కేజ్రీవాల్ పోరుబాట... భూసేకరణ చట్టానికి నిరసనగా 22న ఢిల్లీలో ర్యాలీ


ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు పోరుబాట అంటే యమ క్రేజీగా ఉన్నట్టుంది. గతంలో అందిన అధికారాన్ని పోరుబాట పట్టి వదులుకున్న ఆయన, తాజాగా రెండోసారి అధికారం అందినా, పోరుబాట వీడేది లేదంటున్నారు. నాడు మన్మోహన్ సర్కారుపై ఆందోళనకు దిగిన కేజ్రీ, తాజాగా మోదీ ప్రభుత్వంపై నిరసనకు సిద్ధమవుతున్నారు. భూసేకరణ చట్టానికి చేసిన సవరణను నిరసిస్తూ ఆయన ఈ నెల 22న డిల్లీలో నిరసన ర్యాలీని చేపట్టనున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ భవనం దాకా సాగనున్న ఈ ర్యాలీలో ఆప్ కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో సామాజిక ఉద్యమకారులు కూడా పాలుపంచుకునే అవకాశాలున్నట్లు సమాచారం. మరి ఈ నిరసన ర్యాలీ తర్వాత ఆయన భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి.

  • Loading...

More Telugu News