: మోదీ పాప్యులారిటీని ఘర్ వాపసీ తగ్గించేసింది... నిగ్గు తేల్చిన ఇండియా టుడే-సిసిరో సర్వే


దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తెర తీసిన ఘర్ వాపసీ, ప్రధాని నరేంద్ర మోదీని కూడా కిందకు దిగజార్చేసిందట. మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత దేశంలో పురుడు పోసుకున్న ఈ మత మార్పిడి, మోదీ ప్రాభవాన్నే మసకబార్చిందట. అధికారం చేపట్టి పది నెలలు ముగిసిన సందర్భంగా మోదీ సర్కారుపై ఇండియా టుడే-సిసిరో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్లలో ఘర్ వాపసీ 27 సీట్లకు గండి కొట్టేంత పెను ముప్పుగా పరిణమించింది. సర్వేలో మొత్తం 12 వేల మంది పాలుపంచుకుంటే, నిజాయతీపరుడిగా మోదీకి దేశంలోనే అగ్రస్థానం లభించింది. 2014 ఆగస్టుతో పోలిస్తే, మోదీ వ్యక్తిగత పాప్యులారిటీ బాగా దెబ్బతింది. దీనికి ఘర్ వాపసీనే కారణమని ఆ సర్వే తేల్చిచెప్పింది.

  • Loading...

More Telugu News