: ఇరాన్ అణు ఒప్పందాన్ని స్వాగతించిన భారత్


ఇరాన్, ఆరు ప్రపంచ శక్తిమంత (సిక్స్ వరల్డ్ పవర్స్) దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది. ఈ మేరకు దేశ విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఓ ప్రకటనలో తెలిపారు. తామెప్పుడూ శాంతియుత కార్యక్రమాలకు మద్దతిస్తామని, ఆరు దేశాల ప్రతినిధులు ఇరాన్ తో ఆ మేరకు జరిపిన చర్చలు విజయవంతమయ్యాయని చెప్పారు. దానిపై పూర్తి స్థాయిలో జరిగి ఒప్పందంపై జూన్ 30న సంతకాలు జరగనున్నాయని వివరించారు. ఇరాన్ అణు కార్యక్రమాల వివాదాన్ని ఆ దేశ హక్కులను గౌరవిస్తూనే శాంతియుత మార్గంలో పరిష్కరించాలని భారత్ ఎప్పుడూ కోరుకుంటుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News