: ఒంటిమిట్టలో అవమానం... రాజంపేటలో మీడియా ముందు విప్ మేడా కన్నీటి పర్యంతం
ఒంటిమిట్టలో తనకు అవమానం జరిగిందని ఏపీ ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఆరోపించారు. ఒంటిమిట్టలో జరుగుతున్న కోదండరాముడి కల్యాణోత్సవానికి నిన్న కుటుంబ సమేతంగా హాజరైన తనను అధికారులు పట్టించుకోలేదని, ప్రొటోకాల్ పాటించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులను కూడా లోపలికి అనుమతించలేదని ఆయన వాపోయారు. ఒంటిమిట్టలో తనకు జరిగిన అవమానాన్ని రాజంపేటలో మీడియాకు వివరిస్తున్న సందర్భంగా ఆయన దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. దీంతో ఆయన ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. తనకు జరిగిన అవమానంపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు ఆయన రోదిస్తూనే చెప్పారు.