: బెంగళూరులో టెన్షన్... బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ విద్యార్థి విభాగం నినాదాలు


కర్ణాటక రాజధాని బెంగళూరులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ సమావేశాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నినాదాలు చేసింది. అంతేకాక బీజేపీ సమావేశాలను అడ్డుకునే విద్యార్థి విభాగం కార్యకర్తలు భారీ సంఖ్యలో పీసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. పీసీసీ కార్యాలయం నుంచి బీజేపీ సమావేశాలు జరుగుతున్న వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నారు. పరిస్థితిని అంచనా వేసిన పోలీసులు భారీ ఎత్తున బలగాలను రంగంలోకి దించారు. రోడ్డుపైకే వచ్చే విద్యార్థులను నిలువరించడంతో పాటు అవసరమైతే అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు సన్నద్ధంగా ఉన్నారు.

  • Loading...

More Telugu News