: దుబాయ్ పంపిస్తానని ముంబైలో వదిలేశారు... లబోదిబోమంటున్న మొగల్తూరు యువకులు


ఉపాధి కోసం అరబ్ దేశాల బాట పడుతున్న వలస పక్షులను మోసగిస్తున్న ఏజెంట్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మొన్నటికి మొన్న తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వారిని మెరుగైన ఉపాధి చూపుతామని చెప్పి గల్ఫ్ లోని అడవుల్లో పనికి కుదిర్చిన మాయగాళ్ల ఉదంతం మరువకముందే, తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన 45 మంది యువకులు ఏజెంట్ల అవతారమెత్తిన మాయగాళ్ల చేతిలో మోసపోయారు. దుబాయి పంపిస్తామని ఒక్కొక్కరి వద్ద రూ.1.5 లక్షలు వసూలు చేసిన ఏజెంట్లు, 45 మందిని ముంబైలో వదిలేసి పత్తా లేకుండా పోయారు. రెండు రోజుల పాటు ముంబైలోనే ఏజెంట్ కోసం పడిగాపులు కాసిన మొగల్తూరు యువకులు జరిగిన మోసాన్ని గ్రహించి ఎలాగోలా నేటి ఉదయం నరసాపురం చేరుకున్నారు. తమను నట్టేట ముంచిన ఏజెంట్ పై చర్యలు తీసుకోవడంతో పాటు తమ వద్ద వసూలు చేసిన డబ్బును తిరిగి ఇప్పించాలని బాధితులు అధికారులను వేడుకున్నారు.

  • Loading...

More Telugu News