: జెట్ స్పీడుతో ముస్లిం జనాభా పెరుగుదల... 2050 నాటికి భారత్ లోనే అధికమట!


ప్రపంచంలో ముస్లిం జనాభానే శరవేగంగా పెరుగుతోందట. 2050 నాటికి ముస్లిం జనాభాలో భారత్ ప్రపంచంలోనే తొలిస్థానానికి చేరుతుందని అమెరికాలోని ‘ప్యూ రీసర్చ్ సెంటర్’ ప్రపంచంలో మత పరంగా జనాభా పెరుగుదలపై చేసిన అధ్యయనం ఈ మేరకు అంచనా వేసింది. ఈ అధ్యయనం ప్రకారం... ప్రపంచంలో హిందువులు, క్రైస్తవుల జనాభా కంటే కూడా ముస్లింల జనాభానే అధిక వేగంతో దూసుకుపోతోంది. 2050 నాటికి భారత్ లో ముస్లిం జనాభా ఇండోనేసియా జనాభాను మించిపోతుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం 34 శాతం పెరుగుదల నిష్పత్తితో పెరుగుతున్న హిందువుల జనాభా ప్రపంచ జనాభాలో మూడో స్థానానికి ఎగబాకుతుందని ఆ అధ్యయనం లెక్కగట్టింది. 2050 నాటికి ప్రపంచ జనాభాలో 14.9 శాతంగా ఉండనున్న హిందువుల్లో ఏ మతంతో సంబంధం పెట్టుకోకుండా ఉండేవారి సంఖ్య 13.2 శాతంగా ఉంటారని సదరు అధ్యయన నివేదిక అంచనా వేసింది.

  • Loading...

More Telugu News