: తెలంగాణలో పాగా... ఆంధ్రాలో జాగా!: బెంగళూరులో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ


దక్షిణాది రాష్ట్రాలు... ప్రధానంగా కొత్త రాష్ట్రం తెలంగాణ, రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బలోపేతమే లక్ష్యంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రారంభమైన ఈ సమావేశాల్లో పాలుపంచుకునేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు, పార్టీ ప్రముఖులంతా నిన్న సాయంత్రానికే బెంగళూరు చేరుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే అంశంపైనే ఈ సమావేశాల్లో పార్టీ నేతలు ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఈ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సభ్యత్వ నమోదునూ పార్టీ సమీక్షించనుంది.

  • Loading...

More Telugu News