: తెలంగాణలో జడ్పీ చైర్మన్ లకు ఆపర్ల వెల్లువ... కొత్త ఇన్నోవా కారుకు రూ.15 లక్షలు
తెలంగాణలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు బంపర్ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ లకు ఈ ఆఫర్లు కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. ఇటీవలే వారి గౌరవ వేతనాన్ని రూ.7,500 ల నుంచి ఒకేసారి రూ.1 లక్షకు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. చట్టం ప్రకారం కేబినెట్ హోదా కలిగిన జడ్పీ చైర్మన్లకు అతి తక్కువ వేతనాలెందుకని భావించిన కేసీఆర్, వారి వేతనాలను ఎమ్మెల్యేల వేతనాలకు దారిదాపుల్లోకి తీసుకెళ్లారు. దీంతో సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయిన జడ్పీ చైర్మన్లకు కేసీఆర్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇన్నోవా వాహనాలు కొనుగోలు చేసుకునేందుకు ఒక్కో జడ్పీ చైర్మన్ కు రూ.15 లక్షల నిధులు విడుదల చేశారు.