: ఉత్తర కొరియా అధ్యక్షుడి భామా కలాపం... ‘ప్లెజర్ ట్రూప్’ నియామకానికి శ్రీకారం!


అణ్వస్త్రాలతో అమెరికాను భయపెట్టడమే కాక, మరో విషయంలోనూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. నృత్యం, గానం, విలాసాలతో తనను సంతోషంలో ముంచెత్తే అందమైన భామలను నియమించుకునేందుకు ఆయన శ్రీకారం చుట్టారు. అధ్యక్షుడిని సరస సల్లాపాలతో ఊరించి, సంతోషపరిచే అందమైన సుందరాంగులతో కూడిన సమూహాన్ని ‘ప్లెజర్ ట్రూప్’గా పిలుస్తారు. ఇలాంటి గ్రూపును నియమించాల్సిందిగా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అణ్వాయుధాల ప్రయోగాలకు కాస్తంత విరామమిచ్చిన అధికారులు ప్రస్తుతం అధ్యక్షుడికి నూతనోత్తేజం ఇచ్చే అందమైన భామలను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇదేమీ కొత్త సంప్రదాయం కాదులెండి. గతంలో ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్, తాత కిమ్ ఇల్ సుంగ్ లు కూడా ప్లెజర్ ట్రూప్స్ తో విలాసాల్లో మునిగి తేలినవారే. కిమ్ ఇల్ సుంగ్ ఈ తరహా విలాసాలకు శ్రీకారం చుట్టారు. మూడేళ్ల క్రితం ఇల్ మరణంతో ఆయన కుమారుడు ఉన్ దేశాధ్యక్ష పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. తండ్రి మరణం నేపథ్యంలో మూడేళ్ల పాటు దేశంలో సంతాప దినాలను ప్రకటించిన ఉన్, సంతాప దినాలు ముగియడంతో ప్లెజర్ ట్రూప్స్ నియామకానికి తెర లేపారు. దాదాపు 30 నుంచి 40 మంది దాకా టీనేజీ అమ్మాయిలను ఈ ట్రూప్ కింద ఎంపిక చేస్తారు. ఇలా ఎంపిక చేసిన అమ్మాయిలను వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండానే అధికారులు అధ్యక్ష భవనానికి తరలిస్తారు.

  • Loading...

More Telugu News