: నలుగురు ఉగ్రవాదులు 147 మంది విద్యార్థులను చంపేశారు...కెన్యాలో ఇస్లామిక్ టెర్రరిస్టుల నరమేధం!


కెన్యాలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. క్రైస్తవ విద్యార్థులే లక్ష్యంగా కెన్యా నగరం గారిస్సాలోని ఓ యూనివర్సిటీపై దాడికి దిగిన ఉగ్రవాదులు ఏకంగా 147 మంది విద్యార్థులను పొట్టనబెట్టుకున్నారు. నిన్న రోజంతా జరిగిన ఈ దారుణ మారణ కాండలో మరో 76 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. కేవలం నలుగురంటే నలుగురు ఉగ్రవాదులు తుపాకులు చేతబట్టి నిన్న ఉదయం యూనివర్సిటీలోకి చొరబడ్డారు. వచ్చీ రావడంతోనే కాల్పులకు తెరతీసిన ఉగ్రవాదులు మానవత్వం మరచి రెచ్చిపోయారు. కనిపించిన వారినంతా కాల్చుకుంటూ వెళ్లారు. టెర్రరిస్టుల నరమేధంపై సమాచారం అందుకున్న కెన్యా సైన్యం రంగంలోకి దిగి, రోజంతా పోరాడి ఉగ్రవాదులను కట్టడి చేసింది. కెన్యాలో ఇప్పటిదాకా జరిగిన అతిపెద్ద ఉగ్రదాడిగా పరిగణిస్తున్న ఈ దాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు.

  • Loading...

More Telugu News