: వైభవంగా ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం... పట్టువస్త్రాలు సమర్పించిన నరసింహన్, చంద్రబాబు
కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సీఎం రమేశ్ తదితరులు హాజరయ్యారు. స్వామివారికి గవర్నర్ నరసింహన్ దంపతులు, చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ మహోత్సవానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. సీతారాముల కల్యాణాన్ని చూసి తరించిపోయారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఈ దేవాలయంలో తొలిసారిగా ప్రభుత్వ లాంఛనాలతో వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.