: ఉన్నత విద్య విషయంలో బాగా వెనుకబడిపోయాం: ప్రణబ్
ఉన్నత విద్య విషయానికొచ్చేసరికి అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారత్ బాగా వెనుకబడి ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విచారం వ్యక్తం చేశారు. కోల్ కతాలోని దక్షిణేశ్వర్ రామకృష్ణ సంఘ అద్యాపీఠ్ శతవార్షిక వేడుకల ఆరంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో మరిన్ని పరిశోధనలు, ఆవిష్కరణలు జరగాలని ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా టాప్ 200 యూనివర్శిటీల్లో ఒక్క భారత వర్శిటీ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయులు చాలామంది నోబెల్ ప్రైజు గెలిచారు కానీ, వారందరూ భారత్ వెలుపల పరిశోధనలు చేసినవారేనని అన్నారు.