: నల్గొండ కాల్పుల ఫలితం ఎస్పీ బదిలీ


నల్గొండ జిల్లా సూర్యాపేటలో కాల్పుల కలకలం ఎస్పీపై బదిలీ వేటుపడేలా చేసింది. సూర్యాపేట కాల్పుల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాత్రి తనిఖీలకు వెళ్లిన పోలీసులు సరైన రక్షణ ఏర్పాట్లు లేకుండా ఎలా వెళ్లారంటూ ఎస్పీ ప్రభాకరరావును నిలదీసింది. జరిగిన దారుణానికి బాధ్యుడిని చేస్తూ, నల్గొండ ఎస్పీ స్థానం నుంచి సీఐడీ ఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో జిల్లా ఎస్పీగా విక్రమ్ జీత్ దుగ్గల్ ను నియమించింది.

  • Loading...

More Telugu News