: గుంటూరు జిల్లాలో బాంబు పేలుళ్ల కలకలం


గుంటూరు జిల్లాలో బాంబుపేలుళ్ల కలకలం రేగింది. బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. గడ్డివాముల్లో దాచిన బాంబులు ఎండ వేడిమి కారణంగా పేలినట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. సాధారణంగా గడ్డిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దానికి తోడు వేసవి! దీంతో, గడ్డివాములో దాచి ఉంచిన బాంబులు పేలిపోయి ఉంటాయని స్థానికులు పేర్కొంటున్నారు. పేలుళ్లతో ఉలిక్కిపడ్డ గ్రామస్థులు సమాచారం అందించడంతో, రంగంలోకి దిగిన పోలీసులు, కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. బాంబులు గ్రామంలోకి ఎవరు తెచ్చారు? ఎందుకు తెచ్చారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News