: చింపాంజీలకు ఈస్టర్ కానుకలు


క్రిస్ మస్, ఈస్టర్ పండుగలను విశేషంగా జరుపుకునే విదేశీయులు, ఆయా పండుగల్లో బహుమతులు ఇచ్చిపుచ్చుకుని అభినందనలు తెలుపుకుంటుంటారు. ఈ పండుగలను పురస్కరించుకుని, ఆస్ట్రేలియన్లు జంతువులపై ప్రేమ ప్రదర్శించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ జూలో చింపాంజీలకు ఈస్టర్ కానుకలు అందజేశారు. సాధారణంగా సమయానికి భోజనం అందించే జూ నిర్వాహకులు, చింపాంజీల కోసం రంగురంగుల కాగితాల్లో కోడిగుడ్డు ఆకారంలో బహుమతులు తయారు చేశారు. అందులో చింపాంజీలకు ఇష్టమైన ఆహారపదార్థాలు ఉంచారు. దీంతో, చింపాంజీలు పండగ చేసుకున్నాయి.

  • Loading...

More Telugu News