: కొడుకు మరణవార్తను ఏప్రిల్ ఫూల్ పరిహాసమనుకున్నారు!
ఉత్తరప్రదేశ్ లో ఏప్రిల్ 1న విషాద ఘటన చోటుచేసుకుంది. జలౌన్ జిల్లాకు చెందిన అంకిత్ అనే 24 ఏళ్ల యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా, రైల్వే పోలీసులు ఆ విషయాన్ని అతడి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలిపారు. అయితే, వారు ఆ విషయాన్ని ఏప్రిల్ ఫూల్ పరిహాసంగా కొట్టిపారేశారు. మరోసారి కాల్ చేసినా వారు అలానే భావించారు. దీంతో, ముందు ఆ యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. అనంతరం, రైల్వే పోలీసులు విషయం వివరించడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, అంకిత్ బలవన్మరణానికి కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని అతడి తల్లిదండ్రులకు అందించి, ఆపై దర్యాప్తు చేస్తామని రైల్వే పోలీసులు చెప్పారు.