: పగలు హోంగార్డు... రాత్రి చైన్ స్నాచర్


సాంకేతిక పరిజ్ఞానం సరికొత్త పుంతలు తొక్కుతోంది. వాట్స్ యాప్ ఓ పోలీస్ దొంగ బండారం బయటపెట్టింది. సైబరాబాద్ పరిధిలోని బాలానగర్ లో పగలు ట్రాఫిక్ పోలీసు రూపంలో విధులు నిర్వర్తించే హోంగార్డు, జీడిమెట్ల ప్రాంతంలో రాత్రి పూట దొంగ అవతారమెత్తి చైన్ స్నాచింగ్ చేస్తున్న వ్యవహారం బయటపడింది. గతరాత్రి చైన్ స్నాచింగ్ కు పాల్పడిన వ్యక్తి ఫోటోను వాట్స్ యాప్ లో పోలీసులకు పంపారు జీడిమెట్లకు చెందిన బాధితులు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు, వాట్స్ యాప్ ఫోటోలో ఉన్న బైక్ గురించి ఆరాతీశారు. దీంతో బైక్ కోసం గాలిస్తుండగా, దానిపై ప్రయాణిస్తున్న హోంగార్డు జీడిమెట్ల పోలీసులకు దొరికిపోయాడు. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హోంగార్డు 12 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News