: దేశ రాజధానిలో రూ.25 కోట్ల విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువుల అపహరణ


దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళుతున్న ట్రక్ ను గుర్తు తెలియని గ్యాంగ్ ఒకటి ఎత్తుకెళ్లింది. ఆగ్నేయ ఢిల్లీలోని కాళింది కుంజ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ట్రక్ లోని వస్తువుల విలువ దాదాపు రూ.25 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. గత రాత్రి ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు నుంచి నోయిడా వెళుతుండగా కొంతమంది దారిదోపిడీ దొంగలు ట్రక్ ను ఆపారని, డ్రైవర్ ను, అతడి సహాయకుడిని కొట్టి కత్తితో బెదిరించారని పోలీసు అధికారులు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, పలు పోలీసు బృందాలు వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News