: మెక్ కల్లమ్ ను వరించిన న్యూజిలాండ్ ప్రతిష్ఠాత్మక పురస్కారం


న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ ను ఆ దేశ ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది. న్యూజిలాండ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సర్ రిచర్డ్ హ్యాడ్లీ మెడల్ ను మెక్ కల్లమ్ కు ప్రదానం చేశారు. ప్రపంచకప్ లో తమ జట్టును ఫైనల్స్ వరకు తీసుకెళ్లినందుకు ఆయనకు ఈ పురస్కారం అందజేశారు. కాగా, ఫైనల్స్ లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయనప్పటికీ మెక్ కల్లమ్ కు అభిమానులు పెరిగారు. వరల్డ్ కప్ ప్రదర్శన అనంతరం మెక్ కల్లమ్ టీమ్ కు న్యూజిలాండ్ లో విశేషమైన ఆదరణ పెరిగింది.

  • Loading...

More Telugu News