: గిరిరాజ్ సింగ్ పై కేసు నమోదు చేయండి: ముజఫర్ పూర్ సీజేఎం కోర్టు


కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పై కేసు నమోదు చేయాలని బీహార్ లోని ముజఫర్ పూర్ సీజేఎం న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ తెల్ల తోలు మహిళ అయినందునే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా అంగీకరించిందని, అదే సోనియా నైజీరియా మహిళ అయి ఉంటే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అంగీకరించి ఉండేది కాదని గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ న్యాయవాది వేసిన పిటిషన్ విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. కాగా, గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ్ ఖండించారు. ఆ వ్యాఖ్యలు ఓ కేంద్ర మంత్రి చేయాల్సిన వ్యాఖ్యలు కాదని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పదవిలో ఉన్నప్పుడు భాషను సరిచూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News