: రూ. 40 కోట్ల కోసం ఎందుకింత ఆరాటం?: టీఎస్ ప్రభుత్వాన్ని నిలదీసిన లారీ యజమానుల సంఘం
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 15పై లారీ యజమానుల సంఘం మండిపడింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసింది. ఇప్పటికే కష్టాల్లో ఉన్నామని, కొత్త పన్ను సమస్యలను సృష్టించవద్దని కోరింది. కేవలం రూ. 40 కోట్ల కోసం ఎందుకింత ఆరాటపడుతున్నారని నిలదీసింది. లక్ష కోట్ల రూపాయల బడ్జెట్లో రూ. 40 కోట్లు ఏమాత్రమని ప్రశ్నించింది. స్వల్ప ఆదాయం కోసం వివాదాలు రేపవద్దని సంఘం టీఎస్ ప్రభుత్వానికి సూచించింది. ఇలాంటి నిర్ణయాలు తెలుగువారి మధ్య చిచ్చుపెడతాయని అభిప్రాయపడింది.