: అభిమానులకు సైనా కృతజ్ఞతలు


షటిల్ బ్యాడ్మింటన్ లో తాను ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్నట్టు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) అధికారికంగా ప్రకటించడంపై సైనా నెహ్వాల్ ఆనందం వ్యక్తం చేస్తోంది. తనకు మద్దతు తెలిపిన అభిమానులకు ఈ సందర్భంగా సైనా ట్విట్టర్ లో కృతజ్ఞతలు తెలిపింది. "బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్ లో ఇప్పుడు అధికారికంగా నేను ప్రపంచ నెంబర్ 1. చాలా... చాలా... చాలా సంతోషంగా ఉంది. మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు" అంటూ సైనా ట్వీట్ చేసింది. షటిల్ బ్యాడ్మింటన్ లో సైనా నెహ్వాల్ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకుకు చేరినట్టు ఈరోజు బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన సంగతి విదితమే.

  • Loading...

More Telugu News