: శ్రీకాళహస్తిలో హీరోయిన్ పూనమ్ కౌర్ పూజలు
తెలుగులో 'గగనం', 'శౌర్యం', 'వినాయకుడు', 'గణేశ్ జస్ట్ గణేశ్', 'నాగవల్లి' వంటి పలు చిత్రాల్లో నటించిన పూనమ్ కౌర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం తమిళంలో పలు సినిమాలతో అమ్మడు బిజీగా ఉంది. తాజాగా శ్రీకాళహస్తిలో ఆమె రాహుకేతు పూజలు చేయించుకుంది. తనకున్న దోషాలు పోవాలని, మంచి ఆఫర్లు రావాలని కోరుకుందట. తెలుగులో ఓ రెండు చిత్రాల్లో పూనమ్ చేస్తోంది. కాగా, ఇప్పుడు తమిళంలో చేస్తున్న 'రణం' అనే సినిమాతో మంచి గుర్తింపు వస్తుందని ఆశతో ఉందట. అందులోని ఓ పాటలో అమ్మడు ఏకంగా 400 కాస్ట్యూమ్స్ ఉపయోగిస్తుందట.