: మంగళగిరిలో బీఎండబ్ల్యూ షోరూం... రాజధాని ఎఫెక్ట్
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం క్రమంగా నగర శోభ సంతరించుకుంటోంది. రాజధాని ప్రకటన వెలువడిన కొన్ని రోజులకే తుళ్లూరులో కార్ల కంపెనీలు టెంట్లు వేసి అమ్మకాలు ప్రారంభించడం తెలిసిందే. తాజాగా, ప్రపంచ ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మంగళగిరిలో షోరూం ప్రారంభించడం విశేషం. ఈ షోరూం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఏకంగా బీఎండబ్ల్యూ వంటి దిగ్గజమే ఇక్కడ దుకాణం తెరవడంతో, రానున్న రోజుల్లో మరిన్ని కార్ల తయారీ సంస్థలు ఇక్కడ షోరూంలు తెరిచే అవకాశాలున్నాయి. కాగా, రాజధాని ప్రకటన అనంతరం ఇక్కడ భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. స్థానికులు ఈ బూమ్ ను చక్కగా అందిపుచ్చుకున్నారు.