: తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదుపై దిగ్విజయ్ అసంతృప్తి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుపై ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ఎనిమిది లక్షల సభ్యత్వాలు కూడా నమోదు కాకపోవడమేంటని పార్టీ నేతలను ప్రశ్నించారు. ఈ 15 రోజుల్లో సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలని నేతలకు సూచించారు. బీజేపీ తీసుకొచ్చిన భూసేకరణ బిల్లు తీరుతెన్నులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.