: తెలంగాణ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును మేమే సరఫరా చేస్తాం: సింగరేణి సీఎండీ
తెలంగాణలో విద్యుదుత్పత్తి రంగంలో ఉన్న అన్ని థర్మల్ పవర్ ప్రాజెక్టులకు తామే బొగ్గును సరఫరా చేస్తామని సింగరేణి సీఎండీ శ్రీధర్ ప్రకటించారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత లక్ష్యాన్ని దాటి బొగ్గును వెలికితీశామని ప్రకటించిన ఆయన, ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 17 బొగ్గు బ్లాకులను ప్రారంభించనున్నట్లు కొద్దిసేపటి క్రితం వెల్లడించారు. సంస్థలో ఖాళీ పోస్టులన్నింటినీ త్వరలోనే భర్తీ చేస్తామని, ఉద్యోగులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తామని ప్రకటించారు. సంస్థ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న విద్యుత్ కేంద్రంలో త్వరలోనే విద్యుదుత్పత్తిని ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.