: 16 నుంచి ఆర్టీసీ సమ్మె... యాజమాన్యానికి ఈయూ, టీఎంయూ నోటీసు
ఆర్టీసీలో వేతనాల సవరణ డిమాండ్ తీవ్ర రూపం దాల్చింది. నేటి ఉదయం హైదరాబాదులోని బస్సు భవన్ ను ముట్టడించిన కార్మికులు వేతనాలను పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆందోళనలో డ్రైవర్లు, కండక్టర్లు పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్న నేపథ్యంలో, నగరంలో బస్సులు రోడ్డెక్కలేదు. ధర్నాకు దిగిన కార్మిక సంఘాల నేతలతో యాజమాన్యం జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో కార్మిక సంఘాలు ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్లు సమ్మె నోటీసులిచ్చాయి. తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ఈ నెల 16 నుంచి సమ్మె బాట పట్టనున్నట్లు ఆ నోటీసుల్లో కార్మిక సంఘాలు యాజమాన్యానికి తేల్చిచెప్పాయి.