: ప్లీజ్, మరో ఏడాది పాటైనా ఆడు... సంగక్కరను కోరిన శ్రీలంక క్రీడాశాఖ మంత్రి


సంగక్కర... శ్రీలంక లెజెండరీ క్రికెటర్లలో ఒకడు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్ లో క్వార్టర్ ఫైనల్స్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన తర్వాత, వన్డేల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. ఈ ఏడాది ఆగస్టులో భారత్ తో టెస్ట్ సిరీస్ తర్వాత క్రికెట్ కు పూర్తిగా గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో సంగ ఉన్నాడు. ఈ వ్యవహారంపై శ్రీలంక క్రీడాశాఖ మంత్రి స్పందించారు. వన్డేల నుంచి నిష్క్రమించిన సంగక్కర... తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని, మరో ఏడాది పాటైనా తన సేవలను కొనసాగించాలని కోరారు. ఇప్పటికే తాము సంగక్కరతో మాట్లాడామని, ఆయన నిర్ణయం గురించి ఎదురుచూస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News