: రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలి: చంద్రబాబు


ఏపీ రాజధాని నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. నూతన రాజధాని నిర్మాణానికి నెలలో ఒకరోజు వేతనాన్ని ఉద్యోగులు విరాళంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏపీ సచివాలయంలో మంత్రులు, కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించారు. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా రాజధాని పేరును అమరావతిగా ఖరారు చేసిన తీర్మానాన్ని సీఎం చదవి వినిపించారు. రెండంకెల వృద్ధి సాధన దిశగా పనిచేయాలని అధికారులకు సూచించారు.

  • Loading...

More Telugu News