: సైనా నెంబర్ వన్... అధికారికంగా ప్రకటించిన బ్యాడ్మింటన్ ఫెడరేషన్
షటిల్ బ్యాడ్మింటన్ లో తెలుగు తేజం సైనా నెహ్వాల్ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకులో నిలిచింది. ఈ మేరకు ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన సైనా నెహ్వాల్ కు వరల్డ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ర్యాంకు తప్పనిసరి అన్న అంచనాలు ఇదివరకే వెలువడ్డాయి. అంతేకాక పాయింట్ల ఆధారంగా సైనాకు అగ్రస్థానం కూడా మొన్ననే ఖరారైంది. తాజా ర్యాంకింగ్స్ లో సైనా నెహ్వాల్ కు ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అగ్రస్థానాన్ని కట్టబెడుతూ జాబితాను విడుదల చేసింది.